- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వరకట్నం వేధింపులతో వివాహిత మృతి
వరకట్నం వేధింపులతో వివాహిత మహిళ అనుమానాస్పదంగా మృతి చెందిన సంఘటన నల్గొండ జిల్లా నాంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని నేరళ్ల పెళ్లి గ్రామంలో చోటుచేసుకుంది.

దిశ, మర్రిగూడ (నాంపల్లి) : వరకట్నం వేధింపులతో వివాహిత మహిళ అనుమానాస్పదంగా మృతి చెందిన సంఘటన నల్గొండ జిల్లా నాంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని నేరళ్ల పెళ్లి గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నేరేళ్లపల్లి గ్రామంలో మేకల యాదయ్య కుమార్తె మేకల లక్ష్మి (20 )అదే గ్రామానికి చెందిన గోదాసు రవి కి ఇచ్చి సంవత్సరం క్రితం వివాహం చేశారు. లక్ష్మిని వరకట్నంపై తరచూ అత్తా మామ భర్త వేధిస్తుండేవారు. ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి అనుమానస్పదంగా బాత్రూంలో ఉరి వేసుకుని లక్ష్మీ చనిపోయి ఉంది. అత్త మామ భర్త వేధింపులతోనే తన కుమార్తెను ఉరివేసి బాత్రూం లో పెట్టారని తండ్రి మేకల యాదయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు స్థానిక ఎస్సై లింగారెడ్డి 304 /bకింద కేసు నమోదు చేశారు. ఈ మేరకు శవాన్ని దేవరకొండ ప్రభుత్వాసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం గురువారం తరలించారు. లక్ష్మీ భర్త రవి మామ యాదయ్య, అత్త యాదమ్మలు పరారీలో ఉన్నట్లు ఎస్సై తెలిపారు.
మార్చూరీలోనే లక్ష్మి శవం..
నేరెళ్లపల్లి గ్రామంలో వరకట్నం వేధింపులతో అనుమానస్పదంగా మృతి చెందిన మేకల లక్ష్మి శవాన్ని పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం దేవరకొండ ఆసుపత్రికి తరలించారు. లక్ష్మీ అత్తవారింటికి వారు పరారీలో ఉండగా లక్ష్మీ తల్లిదండ్రులు గ్రామంలో న్యాయం కోసం డిమాండ్ చేస్తున్నారు. పోస్టుమార్టం అయిపోయిన తర్వాత శవాన్ని తీసుకుపోకపోవడం ఎవరూ రాకపోవడంతో పోస్టుమార్టం వద్ద పోలీసులే కాపలా కాస్తున్నారు.
నేరేళ్లపల్లిలో పోలీసులు బందోబస్తు
వివాహిత మహిళా వరకట్నం కేసులో మృతి చెందిన సంఘటనపై నేరెళ్లపల్లి గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా దేవరకొండ డీఎస్పీ శ్రీనివాసరావు నాంపల్లి ఆధ్వర్యంలో ఎస్సై కే లింగారెడ్డి బందోబస్తు ఏర్పాటు చేశారు.






