- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రేమించి తప్పు చేశా, క్షమించండి.. పెళ్లైన 4నెలలకే వివాహిత ఆత్మహత్య
ప్రేమించి పెళ్లి చేసుకున్న నాలుగు నెలలకే ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద ఘటన కర్ణాటకలోని చిక్కమగళూరులో చోటు చేసుకుంది. చిక్కమగళూరుకు చెందిన శ్వేత నగరంలోని ఓ ప్రైవేట్ స్కూల్ లో టీచర్ గా పనిచేస్తోంది.

దిశ, వెబ్ డెస్క్: ప్రేమించి పెళ్లి చేసుకున్న నాలుగు నెలలకే ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద ఘటన కర్ణాటకలోని చిక్కమగళూరులో చోటు చేసుకుంది. చిక్కమగళూరుకు చెందిన శ్వేత నగరంలోని ఓ ప్రైవేట్ స్కూల్ లో టీచర్ గా పనిచేస్తోంది. ఆమె నాలుగు నెలల క్రితం ఓ వ్యక్తిని పెళ్లి చేసుకుని అతడితో కలిసి సుంకదకట్టెలో నివాసం ఉంటోంది. అయితే పెళ్లైన కొద్దిరోజులకే భర్త, అతడి సోదరి వేధింపులకు గురి చేయడంతో శ్వేత సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకుంది. అందులో తన చావుకు భర్త, అతని సోదరే కారణం అని స్పష్టం చేసింది.
వాళ్లిద్దరూ నాకు ఇష్టమైన రీతిలో బతికేందుకు అవకాశం లేకుండా చేశారు. నేను చనిపోతే వాళ్లిద్దరిని విడిచిపెట్టొద్దు. అమ్మా నేను తప్పు చేశాను. నన్ను క్షమించు.. అంటూ లేఖలో పేర్కొంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సూసైట్ నోట్ ఆధారంగా విచారణ జరుపుతున్నారు. ఇప్పటికే శ్వేత భర్త, అతడి సోదరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇక ప్రేమించి పెళ్లి చేసుకున్న కొద్ది రోజులకే శ్వేతం జీవితం అర్థాంతరంగా ముగిసిపోవడంపై ఆమె బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వేధింపులకు పాల్పడినవారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.






