కుటుంబ కలహాలతో వివాహిత ఆత్మహత్య

by Kema Shiva Kumar |

కుటుంబ కలహాలతో వివాహిత ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మెదక్ మండలం జానకంపల్లిలో గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది.

కుటుంబ కలహాలతో వివాహిత ఆత్మహత్య
X

దిశ, మెదక్ టౌన్ : కుటుంబ కలహాలతో వివాహిత ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మెదక్ మండలం జానకంపల్లిలో గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన నారా నర్సింహులుతో లత(30)కు ఎనిమిదేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు సంతానం. గురువారం రాత్రి భార్యాభర్తల మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన లత భర్త నిద్రిస్తున్న సమయంలో ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ సభ్యలకు మెలుకువ వచ్చి చూడగా.. లత దూలానికి వేలాడుతూ కనిపించింది. దీంతో వారు పోలీసులకు సమాచారం అందజేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ మోహన్ తెలిపారు.

Next Story