గంజాయి దొంగలను పట్టించిన రోడ్డు ప్రమాదం.. అసలేం జరిగిందంటే?

by Gantepaka Srikanth |

రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్ స్టేషన్(Abdullapurmet Police Station) పరిధిలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది.

గంజాయి దొంగలను పట్టించిన రోడ్డు ప్రమాదం.. అసలేం జరిగిందంటే?
X

దిశ, వెబ్‌డెస్క్: రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్ స్టేషన్(Abdullapurmet Police Station) పరిధిలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. శనివారం మధ్యాహ్నం బాటసింగారం వద్ద అతివేగంగా వచ్చిన ఓ కారు డివైడర్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవర్‌ సహా పలువురికి స్వల్ప గాయాలు అయ్యాయి. అయితే ప్రమాదం(Road Accident)లో జరిగిన కారులో గంజాయి(Marijuana) తరలిస్తున్నారు. ప్రమాదం విషయం తెలిసిన వెంటనే పోలీసుల హుటాహుటిన స్పాట్‌కు వచ్చారు. కారును పరిశీలించగా అందులో గంజాయి లభ్యమైంది. ఒడిశా నుంచి మహారాష్ట్రకు గంజాయి తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

Next Story