- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మావోయిస్టులు.. పోలీసుల మధ్య ఎదురు కాల్పులు
by Malleboina Mahesh |
మావోయిస్టులు... పోలీసుల మధ్య మరోసారి ఎదురు కాల్పులు జరిగాయి. ఈ సంఘటన దంతేవాడ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం తెల్లవారుజామున జరిగింది.

X
దిశ తెలంగాణ, క్రైమ్ బ్యూరో: మావోయిస్టులు... పోలీసుల మధ్య మరోసారి ఎదురు కాల్పులు జరిగాయి. ఈ సంఘటన దంతేవాడ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం తెల్లవారుజామున జరిగింది. పడంపూర్ సమీపంలో రైల్వే ట్రాక్ మరమ్మత్తుల అధికారులు ఓ జెసీబీ, ట్రక్‌ను తెప్పించారు. కాగా, తెల్లవారుజాము 1.30 సమయంలో మావోయిస్టులు వీటికి నిప్పు పెట్టారు.
అదే సమయంలో బచేలి పోలీస్ స్టేషన్ సిబ్బంది కూంబింగ్ చేస్తూ అటుగా వచ్చారు. మావోయిస్టులను చూసి కాల్పులు జరిపారు. దీంతో మావోయిస్టులు ఎదురు కాల్పులు జరుపుతూ అడవుల్లోకి పారిపోయారు. మావోయిస్టుల కోసం గాలింపు కొనసాగుతున్నట్టు పోలీస్ అధికారులు చెప్పారు.
Next Story






