మావోయిస్టు పార్టీ మెంబర్ శ్రీవిద్యకు రిమాండ్.. కంది డిస్ట్రిక్ట్ జైలుకు తరలింపు

by Kema Shiva Kumar |   (  Updated:2025-07-25 04:32:37  IST  )

మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు తక్కలపల్లి వాసుదేవ రావు (Takkalapalli Vasudeva Rao) అలియాస్ ఆశన్న సతీమణి నార్ల శ్రీవిద్య (Sri Vidya)ను తెలంగాణ పోలీసులు హఫీజ్‌పేట్‌లో గురువారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు.

మావోయిస్టు పార్టీ మెంబర్ శ్రీవిద్యకు రిమాండ్.. కంది డిస్ట్రిక్ట్ జైలుకు తరలింపు
X

దిశ, వెబ్‌డెస్క్: మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు తక్కలపల్లి వాసుదేవ రావు (Takkalapalli Vasudeva Rao) అలియాస్ ఆశన్న సతీమణి నార్ల శ్రీవిద్య (Sri Vidya)ను తెలంగాణ పోలీసులు హఫీజ్‌పేట్‌లో గురువారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు ఆమెను ఇవాళ ఉదయం రంగారెడ్డి జిల్లా కోర్టులో ప్రవేశపెట్టారు. పోలీసుల వాదనలు విన్న న్యాయమూర్తి శ్రీవిద్యకు రిమాండ్ విధించారు. దీంతో ఆమెను సంగారెడ్డి జిల్లాలోని కంది (Kandi) డిస్ట్రిక్ట్ జైలుకు తరలించారు. మియాపూర్ పోలీస్‌ స్టేషన్‌లో నమోదైన కేసులో పోలీసులు శ్రీవిద్యను అరెస్ట్ చేసినట్లుగా ప్రాథమికంగా తెలుస్తోంది. కాగా, శ్రీవిద్య ఐపీఎస్ అధికారి ఉమేష్ చంద్ర (Umeshchandra) హత్య కేసు, మాజీ సీఎం చంద్రబాబు (Chandrababu)పై జరిగిన అటాక్‌తో పరోక్షంగా సంబంధాలు కలిగి ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

Next Story