- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పిచ్చికుక్క దాడిలో పలువురికి గాయాలు..
పిచ్చికుక్క దాడిలో పలువురు తీవ్ర గాయాలపాలైన సంఘటన రామడుగు మండలం తిరుమలపూర్ గ్రామంలో చోటుచేసుకుంది.

X
దిశ, రామడుగు : పిచ్చికుక్క దాడిలో పలువురు తీవ్ర గాయాలపాలైన సంఘటన రామడుగు మండలం తిరుమలపూర్ గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. గ్రామస్తుల తెలిపిన వివరాల ప్రకారం గ్రామంలో స్వైరవిహారం చేస్తున్న పిచ్చికుక్క ఇళ్లల్లోకి వచ్చి మరి దాడి చేస్తున్నదని, చిన్న పిల్లలు మొదలుకుని ముసలివారి వరకు ఎవరినీ వదలడం లేదని స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.
కుక్కల దాడిలో పలువురు గాయాలపాలయ్యారని తెలిపారు. గాయాలపాలైన వారిని కరీంనగర్లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారని తెలిపారు. ఒక్కసారిగా కుక్క పలువురు పై దాడి చేయడంతో గ్రామంలో భయాందోళన మొదలైంది. గ్రామంలో జరిగిన ఘటన పై డీఏం అండ్ హెచ్ ఓ తక్షణమే స్పందించి గ్రామంలో మెడికల్ క్యాంపు ఏర్పాటు చేసి క్షతగాత్రులకు వైద్యం అందించాలని వైఎస్సార్ టీపీ చొప్పదండి నియోజకవర్గం ఇంచార్జ్ తడగొండ సత్యరాజ్ వర్మ డిమాండ్ చేశారు.
Next Story






