మురుగు కాలువలో వ్యక్తి మృతదేహం

by Chintha Aamani |

కొత్తకోట మున్సిపాలిటీ కేంద్రంలోని స్థానిక జి. టీ నారాయణ స్కూల్ దగ్గర ఉన్న డ్రైనేజి కాలువలో సోమవారం గుర్తు తెలియని వ్యక్తి శవం లభ్యం అయ్యింది.

మురుగు కాలువలో వ్యక్తి మృతదేహం
X

దిశ, కొత్తకోట: కొత్తకోట మున్సిపాలిటీ కేంద్రంలోని స్థానిక జి. టీ నారాయణ స్కూల్ దగ్గర ఉన్న డ్రైనేజి కాలువలో సోమవారం గుర్తు తెలియని వ్యక్తి శవం లభ్యం అయ్యింది. డ్రైనేజీ కాలువలో మృతదేహాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి శవాన్ని పరిశీలించిన అనంతరం గుర్తు తెలియని శవం గా భావించి పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించినట్లు స్థానికులు తెలిపారు.

Next Story