- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- కార్టూన్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- ఫోటోలు
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- Telangana Assembly Election 2023
మామిడి తోట దగ్ధం..
by Disha Web Desk 20 |

X
దిశ, నర్సంపేట : గుర్తు తెలియని వ్యక్తులు మంట పెట్టడంతో మామిడి తోట దహనమైన సంఘటన నర్సంపేట మండలంలోని ఇటుకాలపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం ఇటుకాలపల్లికి చెందిన నాంపల్లి ఐలయ్య తనకున్న రెండెకరాలలో మామిడి, టేకు చెట్లను పెంచుతున్నాడు.
ఇదిలా ఉండగా గతరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు మంట పెట్టడంతో మామిడి చెట్లు, టేకు చెట్లు దగ్ధమైనట్లు ఆవేదన వ్యక్తం చేశారు. డ్రిప్ పైపులు, బోర్ మోటార్ సహా ప్లాస్టిక్ పైపులు అన్నీ కాలిపోయినట్లు బాధితులు తెలిపారు. ఈ ప్రమాదంలో దాదాపు లక్ష రూపాయల నష్టం వాటిల్లినట్లు తెలిపారు. బాద్యులని గుర్తించి న్యాయం చేయాలని బాధితులు వేడుకుంటున్నారు. మామిడి తోట దగ్దానికి సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
Next Story