కారు ఆటో ఢీ.. ఇద్దరికి గాయాలు

by Bhanu |

కారు, ఆటో ఢీ కొన్న ఘటనలో మండలంలోని మల్లూరుకు చెందిన ఆటో డ్రైవర్ సోయం ఈశ్వర్, మారబోయిన రాంబాబులు తీవ్రంగా గాయపడిన

కారు ఆటో ఢీ.. ఇద్దరికి గాయాలు
X

దిశ, మంగపేట : కారు, ఆటో ఢీ కొన్న ఘటనలో మండలంలోని మల్లూరుకు చెందిన ఆటో డ్రైవర్ సోయం ఈశ్వర్, మారబోయిన రాంబాబులు తీవ్రంగా గాయపడిన ఘటన మల్లూరు ప్రధాన రహదారి హేమాచల శ్రీలక్ష్మీనృసింహాస్వామి ఆలయం ఆర్చీ సమీపంలో ఉదయం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. సోయం ఈశ్వర్ తన ఆటోలో భక్తులను తీసుకోని మల్లూరు గ్రామం వైపు వస్తుండగా మణుగూరు నుండి చిన్నబోయిన పల్లి వెల్తున్న కారు ఆర్చీ సమీపంలోని మూలమలుపు వద్ద ఢీ కొట్టింది.

ఈ ఘటనలో కారు, ఆటో ధ్వంసం కాగా ఆటోలోని ఈశ్వర్, రాంబాబులు తీవ్రంగా గాయడ్డట్లు స్థానికులు తెలిపారు. గాయపడ్డ వారిని హుటా హుటిన గ్రామంలోని ఆర్ఎంపీ వ్దకు తీసుకెల్లి ప్రాథమిక చికిత్స అనంతరం ఏటూరునాగారం సామాజిక ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. దేవాలయం ఆర్చీ సమీపంలో స్థానికులు రోడ్డుపైనే షాపులు పెట్టి అడ్డుగా నిలబడుతూ వ్యాపారాలు చేయడం వల్లనే ఆటో డ్రైవర్ కు దారి కనిపించక రోడ్డు ప్రమాదానికి గురైనట్లు వారు అనుమానం వ్యక్తం చేశారు. ప్రతి రోజు వందలాదిగా ఆలయానికి వస్తున్న భక్తులకు ప్రమాదాలు జరగకముందే సంబందిత అధికారులు రోడ్డుపై షాపులు పెట్టి ప్రమదాలకు కారణమవుతున్న షాపులను తొలగించి ప్రమాదాలు నివారించాలని కోరుతున్నారు.

Next Story