వనస్థలిపురంలో కత్తి దాడి కలకలం

by Bhanu |   (  Updated:2025-06-27 15:54:09  IST  )

వనస్థలిపురంలో గుర్తుతెలియని వ్యక్తి అకారణంగా ఓ వ్యక్తిపై కత్తితో దాడి చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.

వనస్థలిపురంలో కత్తి దాడి కలకలం
X

దిశ, వనస్థలిపురం: వనస్థలిపురంలో గుర్తుతెలియని వ్యక్తి అకారణంగా ఓ వ్యక్తిపై కత్తితో దాడి చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. హయత్‌నగర్ పరిధిలోని సాయి నగర్ కాలనీకి చెందిన పోలవరపు తాండవ కృష్ణ (41) గురువారం అర్ధరాత్రి తన స్నేహితులతో కలిసి సామనగర్‌లోని జీవీఆర్ కన్వెన్షన్ హాల్ ఎదురుగా నిలబడి మాట్లాడుకుంటుండగా ఈ ఘటన జరిగింది.

సమీపంలోని సాయి యువ బార్ మూసిన తరువాత ఆ బార్‌ నుంచి బయటకు వచ్చిన ఓ గుర్తుతెలియని వ్యక్తి, తాండవ కృష్ణతో ఏమాత్రం కారణం లేకుండానే వాగ్వాదానికి దిగాడు. ఆ తరువాత ఆ వ్యక్తి తన కారులో ఉన్న కూరగాయలు కోసే కత్తిని తీసుకుని తాండవ కృష్ణ కడుపులో పొడిచాడు. తీవ్రంగా గాయపడిన అతన్ని అక్కడి నుంచి పరారైన నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

తన భర్తపై దాడి జరిగిన విషయాన్ని బాధితుడి భార్య దీప పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు వనస్థలిపురం సీఐ మహేష్ గౌడ్ తెలిపారు. కృష్ణను యశోద హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి స్థిరంగా ఉందని సమాచారం.

Next Story