- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భార్యతో గొడవ.. పబ్లిక్‌లో గొంతు కోసిన భర్త
అక్రమ సంబంధాల మోజు, మనస్పర్థలు, కుటుంబ కలహాలు ఇలా రకరకాల కారణాలతో భార్యలు భర్తల్ని, భర్తలు భార్యల్ని చంపుతున్న ఘటనలు వెలుగుచూస్తున్నాయి.

దిశ, వెబ్‌డెస్క్: అక్రమ సంబంధాల మోజు, మనస్పర్థలు, కుటుంబ కలహాలు ఇలా రకరకాల కారణాలతో భార్యలు భర్తల్ని, భర్తలు భార్యల్ని చంపుతున్న ఘటనలు వెలుగుచూస్తున్నాయి. చాలా కాలంగా దూరంగా ఉంటోన్న భార్యతో మాట్లాడాలని వెళ్లిన భర్త.. ఆమెతో జరిగిన వాగ్వాదం కారణంగా వెంట తెచ్చుకున్న కత్తితో దాడి చేశాడు. ఆమె గొంతు కోసేశాడు. ఈ ఘటన ఒడిశాలోని బాలాసోర్ పట్టణంలో జరిగింది. కటక్ కు చెందిన షేక్ అమ్జాద్ తో కొన్ని గొడవల కారణంగా కొంతకాలంగా భార్య దూరంగా నివసిస్తోంది. ఆమెతో మాట్లాడేందుకు వెళ్లిన అమ్జాద్.. రోడ్డుపైనే గొడవ పెట్టుకున్నాడు. ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరగ్గా.. అమ్జాద్ తనతో తెచ్చుకున్న కత్తితీసి ఆమెపై దాడి చేశాడు.
గొంతుకోయడంతో అక్కడికక్కడే భార్య కుప్పకూలిపోగా.. స్థానికులు వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు. బాధితురాలి పరిస్థితి సీరియస్ గా ఉండటంతో ప్రభుత్వ వైద్యులు ఆమెను కటక్ లోని సీఎస్ బీ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ కు తరలించారు. ప్రస్తుతం ఆమె అక్కడ చికిత్స పొందుతోంది. ఇక నిందితుడు అక్కడి నుంచి పరారయ్యేందుకు ప్రయత్నించగా.. స్థానికులు పట్టుకుని దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు అప్పగించగా.. అతనిపై హత్యాయత్నం కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఈ దాడి ఘటన అక్కడికి సమీపంలో ఉన్న సీసీటీవీల్లో రికార్డవ్వగా.. ఆ వీడియో నెట్టింట వైరలవుతోంది. కాగా.. భార్యభర్తల మధ్య గొడవకు కారణాలేంటన్న విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.






