Teacher Murder: దారుణం.. పెళ్లికి నో చెప్పిన టీచర్.. కోపంతో చంపేసిన ఉన్మాది

by Naga Rani Yarlagadda |

పెళ్లికి నో చెప్పిందని, ప్రేమను అంగీకరించలేదన్న కారణాలతో యువకులు.. యువతులపై దాడులు చేసి చంపేస్తున్నారు. తాజాగా తమిళనాడులోని తంజావూరులో దారుణ ఘటన జరిగింది.

Teacher Murder: దారుణం.. పెళ్లికి నో చెప్పిన టీచర్.. కోపంతో చంపేసిన ఉన్మాది
X

దిశ, వెబ్ డెస్క్: ఇటీవల కాలంలో అమ్మాయిలపై దాడులు పెరుగుతున్నాయి. పెళ్లికి నో చెప్పిందని, ప్రేమను అంగీకరించలేదన్న కారణాలతో యువకులు.. యువతులపై దాడులు చేసి చంపేస్తున్నారు. తాజాగా తమిళనాడులోని తంజావూరులో దారుణ ఘటన జరిగింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మల్లిపట్నం ప్రభుత్వ పాఠశాలలో (Mallipatnam Government school) పనిచేస్తున్న టీచర్ పై ఉన్మాది దాడి చేశాడు. మదన్ (30) అనే యువకుడు.. ఇటీవలే పెళ్లి చూపుల్లో రమణి(26)ని చూశాడు. ఇరువురి పెద్దలు పెళ్లి గురించి మాట్లాడుకున్నారు. కానీ.. రమణికి తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని చెప్పింది.

తనను పెళ్లి చేసుకునేందుకు నిరాకరించిన రమణిపై కోపం పెంచుకున్న మదన్.. ఆమె పనిచేస్తున్న స్కూల్ కి వెళ్లి పదునైన ఆయుధంతో దాడి చేశాడు. తీవ్రగాయాలతో రమణి అక్కడికక్కడే కుప్పకూలి మరణించింది. పాఠశాల సిబ్బంది ఇచ్చిన సమాచారంతో అక్కడికి వెళ్లిన పోలీసులు.. రమణి మృతదేహాన్ని పోస్టుమార్టంకు పంపారు. నిందితుడు మదన్ ను అదుపులోకి తీసుకుని విచారించగా.. అసలు విషయం వెల్లడైంది. ఈ ఘటనపై విద్యాశాఖమంత్రి అన్బిల్ మహేష్ లిచారం వ్యక్తం చేశారు. విద్యార్థులందరికీ వెంటనే కౌన్సెలింగ్ ఇవ్వాలని ఆదేశించారు. అలాగే నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

Next Story