కర్నూలు జిల్లాలో దారుణ హత్య.. కాలు నరికి అందరికీ చూపిస్తూ..

by Naga Rani Yarlagadda |

కర్నూల్ జిల్లాలో దారుణ హత్య జరిగింది. ఈ హత్యకు వివాహేతర సంబంధమే ప్రధాన కారణంగా కనిపిస్తోంది.

కర్నూలు జిల్లాలో దారుణ హత్య.. కాలు నరికి అందరికీ చూపిస్తూ..
X

దిశ, వెబ్‌డెస్క్: కర్నూల్ జిల్లాలో దారుణ హత్య (Murder in Kurnool District) జరిగింది. ఈ హత్యకు వివాహేతర సంబంధమే (Extra Marital Affair) ప్రధాన కారణంగా కనిపిస్తోంది. వ్యక్తిని నరికి చంపిన అనంతరం.. అతడి కాలుని నరికి అందరికీ చూపించి.. పోలీస్ స్టేషన్ సమీపంలోనే విసిరేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్నూల్ మండలం సూదిరెడ్డిపల్లెకు చెందిన శేషన్న (54) ఇంటిలో ఉండగా.. సోమవారం అర్థరాత్రి గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు ఇంట్లోకి చొరబడి కొడవళ్లు, కత్తులతో దాడి చేశారు.

శేషన్నను దారుణంగా హతమార్చిన అనంతరం.. అతని కాలుని నరికి వేరు చేసి.. దానిని ఊరంతా చూపిస్తూ పోలీస్ స్టేషన్ సమీపంలో పడేశారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Next Story