రిహబిలేషన్ సెంటర్‌లో హత్య.. కాళ్లు, చేతులు కట్టేసి.. నోటికి ప్లాస్టర్ వేసి.. కిరాతకంగా.. (వీడియో)

by Sujitha Rachapalli |   (  Updated:2025-10-29 13:19:03  IST  )

ఉత్తరప్రదేశ్ మీరట్‌లోని గంగానగర్ పీఎస్ ఏరియాలో దారుణం చోటు చేసుకుంది. రిహబిలేషన్ సెంటర్ ‘న్యూ సవేరా నషా ముక్తి కేంద్రం’లో 42 ఏళ్ల వ్యక్తిని హతమార్చారు సిబ్బంది. కాళ్లు, చేతులు కట్టేసి.. నోటిలో గుడ్డలు కుక్కి.. కొట్టి చంపారు. వివరాల్లోకి వెళ్తే..

రిహబిలేషన్ సెంటర్‌లో హత్య.. కాళ్లు, చేతులు కట్టేసి.. నోటికి ప్లాస్టర్ వేసి.. కిరాతకంగా.. (వీడియో)
X

దిశ, వెబ్ డెస్క్ : ఉత్తరప్రదేశ్ మీరట్‌లోని గంగానగర్ పీఎస్ ఏరియాలో దారుణం చోటు చేసుకుంది. రిహబిలేషన్ సెంటర్ ‘న్యూ సవేరా నషా ముక్తి కేంద్రం’లో 42 ఏళ్ల వ్యక్తిని హతమార్చారు సిబ్బంది. కాళ్లు, చేతులు కట్టేసి.. నోటిలో గుడ్డలు కుక్కి.. కొట్టి చంపారు. వివరాల్లోకి వెళ్తే.. పనీర్ విక్రయించే ఫమీద్ జై గ్రామానికి చెందిన వాడు. కాగా ఆయన భార్య క్యాన్సర్‌తో మరణించడంతో ఒంటరివాడు అయిపోయాడు. మద్యానికి అలవాటుపడ్డాడు. దీంతో ఆయనను రిహబిలేషన్ సెంటర్‌లో అక్టోబర్ 15న చేర్పించాడు ఆయన సోదరుడు. ఐదు రోజుల తర్వాత అక్టోబర్ 20న మరణించాడనే సమాచారం అందింది. అయితే మృతదేహంపై గాయాలు గుర్తించిన సోదరుడు.. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సీసీటీవీ ఫేటేజీ పరిశీలిస్తే కొంత మంది సిబ్బంది ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తేలింది. ఇప్పటికే నిందితులు సునీల్, అరవింద్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు.. పోస్టుమార్టం రిపోర్టు తర్వాత మరిన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Twitter Link ....

Next Story