ప్రైవసీకి అడ్డొస్తుందని.. ప్రియురాలి కూతురును హతమార్చిన ప్రియుడు

by Sujitha Rachapalli |

బెంగళూరులో విషాదకర ఘటన చోటు చేసుకుంది.రొమాన్స్‌కు అడ్డొస్తుందని ప్రియురాలి కూతురిని హతమార్చాడు ప్రియుడు. వివరాల్లోకి వెళ్తే.. శిల్పా ఎస్‌ కె అనే మహిళ ప్రైవేట్ కంపెనీలో బిజినెస్ డెవలప్మెంట్ ఆఫీసర్‌గా పని చేస్తుంది. ఇప్పటికే భర్త బాలాజీ నుంచి విడాకులు తీసుకున్న

ప్రైవసీకి అడ్డొస్తుందని.. ప్రియురాలి కూతురును హతమార్చిన ప్రియుడు
X

దిశ, వెబ్ డెస్క్ : బెంగళూరులో విషాదకర ఘటన చోటు చేసుకుంది.రొమాన్స్‌కు అడ్డొస్తుందని ప్రియురాలి కూతురిని హతమార్చాడు ప్రియుడు. వివరాల్లోకి వెళ్తే.. శిల్పా ఎస్‌ కె అనే మహిళ ప్రైవేట్ కంపెనీలో బిజినెస్ డెవలప్మెంట్ ఆఫీసర్‌గా పని చేస్తుంది. ఇప్పటికే భర్త బాలాజీ నుంచి విడాకులు తీసుకున్న ఆమె.. తల్లితో ఉంటూ బిడ్డను పెంచుకుంది. అయితే తల్లి మరణం తర్వాత ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మాజీ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌ దర్శన్ కుమార్ యాదవ్‌తో ప్రేమలో పడింది. కానీ అతను ఆమె కూతురు సిరిని యాక్సెప్ట్ చేయలేకపోయాడు. ఆమెను హాస్టల్‌లో వదిలేయాలని.. తమ ప్రైవసీకి అడ్డొస్తుందని ఒత్తిడి చేశాడు. కానీ శిల్పా ఇందుకు ఒప్పుకోలేదు. దీంతో వివాదాలు స్టార్ట్ అయ్యాయి. ఈ క్రమంలో కొట్టడం కూడా ప్రారంభించిన దర్శన్.. తల్లీకూతుళ్లను హత్య చేస్తానని బెదిరించడం పెరిగిపోయింది.

ఈ క్రమంలోనే అక్టోబర్ 23న రాత్రంతా శిల్ప ఇంట్లోనే ఉన్న దర్శన్.. ఆమె ఉదయం పనికి వెళ్లిన తర్వాత సిరిని తీసుకుని తన ఇంటికి వెళ్లాడు. మధ్యాహ్నం ఆమెకు కాల్ చేసి వెంటనే రావాలని డిమాండ్ చేశాడు. ఈ సమయంలో సిరి ఏడుస్తూ కేకలు వేయడం విన్న ఆమె.. ఇంటికి చేరుకుంది. అప్పటికే కోపంతో ఉన్న దర్శన్.. శిల్పాను గదిలో లాక్ చేశాడు. ఆమె బయటకు వచ్చేసరికి.. మరో గదిలో సిరి నిర్జీవంగా రక్తపు మడుగులో పడి ఉంది. శిల్పా ఫిర్యాదుతో ఇన్వెస్టిగేషన్ ప్రారంభించిన పోలీసులు. తుమకూర్ రోడ్డు సమీపంలో దర్శన్‌ను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో తనే తప్పు చేసినట్లు ఒప్పుకున్నాడు.

Next Story