దారుణం.. భార్యను ముక్కలు ముక్కలుగా నరికి కుక్కర్‌లో వేసి ఉడికించాడు.?

by Yella Dhawani Reddy |   (  Updated:2025-01-22 16:56:46  IST  )

హైదారాబాద్‌లో మరో దారుణ ఘటన వెలుగుచూసింది.

దారుణం.. భార్యను ముక్కలు ముక్కలుగా నరికి కుక్కర్‌లో వేసి ఉడికించాడు.?
X

దిశ, వెబ్ డెస్క్: అనుమానం పెనుభూతంగా మారి కట్టుకున్న ఇల్లాలును అతి కిరాతకంగా హత్య చేశాడు ఓ కసాయి భర్త. ఆమె డెడ్ బాడీని కత్తితో ముక్కలు ముక్కలుగా నరికి కుక్కర్‌లో ఉడకబెట్టాడు. అనంతరం ఆ ముక్కలను చెరువులో విసిరి వేసిన ఘటన హైదరాబాద్‌లోని మీర్‌పేట్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇదంతా అల్లుడే చేశాడని అత్తింటి వారు ఆరోపిస్తున్నారు. మరోవైపు ఈ ఘటనపై​ పోలీసులు మాత్రం కేవలం మిస్సింగ్​ కేసులు నమోదు చేసినట్లు చెబుతున్నారు. ఇంతకు మాధవి హత్యకు గురైందా? లేదా? అన్నది కూడా మీర్​పేట్​ పోలీసులు తేల్చడం లేదు. ప్రస్తుతం ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది.

వివరాలలోకి వెళితే .. ప్రకాశం జిల్లా జేపీ చెరువుకు చెందిన గురుమూర్తి జిల్లెల్లగూడలోని న్యూ వెంకటేశ్వర నగర్ కాలనీకి వలస వచ్చారు. గురుమూర్తి రిటైర్డ్​ఆర్మీ. ప్రస్తుతం DRDOలో ఔట్ సోర్సింగ్ సెక్యూరిటీ గార్డుగా విధులు నిర్వహిస్తున్నాడు. ప్రకాశం జిల్లా దండుపల్లి గ్రామానికి చెందిన ఉప్పల సుబ్బమ్మ, వెంకటరమణలు దంపతులు. వీరికి ముగ్గురు కుమార్తెలు. వీరిపెద్ద కుమార్తె వెంకట మాధవి(35)ని 13 ఏళ్ల క్రితం గురుమూర్తికి ఇచ్చి వివాహం చేశారు. గురుమూర్తి, వెంకట మాధవి దంపతులకు ఇద్దరు సంతానం. ఇందులో ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. గురుమూర్తి కుటుంబం ఐదేళ్లుగా జిల్లెల్లగూడలోని న్యూ వెంకటేశ్వర నగర్ కాలనీలో అద్దెకు ఉంటున్నారు. గత కొంత కాలంగా గురుమూర్తికి భార్య వెంకట మాధవి పై అనుమానం ఉంది. ఈ నేపధ్యంలో పలు మార్లు వీరి మధ్య గొడవలు జరిగాయి.

ఈనెల 16న కూడా భార్యాభర్తల మధ్య మరోమారు ఘర్షణ తలెత్తిన్నట్లు సమాచారం. అప్పటి నుంచి వెంకట మాధవి కనిపించకుండా పోయింది. సంక్రాంతి పండుగ అనంతరం కూతురు వెంకట మాధవి ఇంటికి ఉప్పల సుబ్బమ్మ, వెంకటరమణ కుటుంబం వచ్చింది. తమ కూతురు కనిపించకపోవడంతో ఆందోళనకు గురయ్యారు. తమ కూతురు ఎక్కడికి వెళ్లిందని అల్లుడు గురుమూర్తిని అత్త ప్రశ్నించగా.. ఈనెల 16న వెంకట మాధవితో గొడవ జరిగిందని, మధ్యాహ్నం 12గంటల ప్రాంతంలో ఆమె ఇంటి నుంచి వెళ్లిపోయిందని చెప్పాడు. దీంతో వెంకట మాధవి కనిపించడం లేదని తల్లి సుబ్బమ్మ మీర్‌పేట్​ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఈనెల 18న మిస్సింగ్​ కేసులు నమోదు చేశారు.

కుక్కను చంపి రిహార్సల్ చేశాకే భార్యను హత్య చేసినట్లు అనుమానాలు?

అయితే తమ కూతురు వెంకట మాధవిని భర్తే అతి కిరాతకంగా హత్య చేసి కత్తితో ముక్కలు ముక్కలుగా నరికాడని, అనంతరం ఆ ముక్కలను కుక్కర్‌లో వేసి ఉడకబెట్టి మీర్‌పేట్ మున్సిపల్​ కార్పొరేషన్​ పరిధిలోని చందన చెరువులో పడవేశాడని మృతురాలి కుటుంభసభ్యులు ఆరోపించారు. అంతేగాకుండా భార్యను హత్య చేయకముందే ఓ కుక్కను చంపి రిహార్సల్​ చేశాడని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తమ కూతురు కనిపించడం లేదని తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడానికి వచ్చిన సమయంలో భర్త కూడా తనకు ఏమి తెలియనట్టుగా వ్యవహరించడం గమనార్హం. కాగా ఈ ఘటనపై మీర్‌పేట్​ పోలీసులు మాధవిని భర్త గురుమూర్తి హత్య చేసినట్లు ఇంకా ఎలాంటి ఆధారాలు లభించలేదని చెబుతున్నారు. కేవలం మాధవి కనిపించడం లేదన్న ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసులు నమోదు చేసినట్లు ఇన్​స్పెక్టర్​ నాగరాజు మీడియాకు వెల్లడించారు.

కాగా ఈ ఘటనలో ఎన్నో అనుమానాలు తలెత్తుతున్నాయి. నిజంగానే భర్త హత్య చేయలేదనుకుంటే అత్తింటి వాళ్లు వచ్చే వరకు తన భార్య మిస్సింగ్​ అయ్యిందని పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేయలేదనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అత్త సుబ్బమ్మ మీర్​ పేట్​ పోలీస్​ స్టేషన్‌లో లిఖిత పూర్వకంగా రాసి ఇచ్చాకే , మీరు ఎందుకు కంప్లైట్​ ఇస్తారు? నేను ఫిర్యాదు చేస్తానని స్పందించడం పట్ల భర్త పై అనుమానాలు తీవ్రతరం అయ్యాయి. ఈ నెల 16వ తేదీన సుబ్బమ్మ ఫిర్యాదు చేస్తే మీర్‌ పేట్​ పోలీసులు ఈనెల 18 వరకు ఎందుకు FIR​ చేయలేదని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. భార్యను హత్య చేసి ముక్కలు ముక్కలుగా నరికి కుక్కర్​ లో ఉడక బెట్టడం అంటే మాధవిని భర్త గురు మూర్తి ఒక్కడే హత్య చేశారా? అతని వెనుక ఇంకా ఎవరయినా సహాయం చేశారా? అన్నది కూడా తేలాల్సి ఉంది. అసలు వెంకట మాధవి హత్యకు గురైందా? లేదా ? అన్నది కూడా ఇంకా తేలాల్సి ఉంది.

Next Story