ఏపీలో దారుణం.. తనను చూసి నవ్వాడని బాలుడిని హత్య చేసిన వ్యక్తి

by Ajay Maddhiboyina |

ఏపీలో దారుణం చోటు చేసుకుంది. భార్య వదిలేసి వెళ్ళిపోతుంటే చూసి నవ్వాడని 17ఏళ్ల బాలుడిని ఓ వ్యక్తి హత్య చేశాడు. ఈ ఘటన తిరుపతి జిల్లా రేణిగుంట సమీపంలోని గువ్వల కాలనీలో చోటు చేసుకుంది.

ఏపీలో దారుణం.. తనను చూసి నవ్వాడని బాలుడిని హత్య చేసిన వ్యక్తి
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో దారుణం చోటు చేసుకుంది. భార్య వదిలేసి వెళ్ళిపోతుంటే చూసి నవ్వాడని 17ఏళ్ల బాలుడిని ఓ వ్యక్తి హత్య చేశాడు. ఈ ఘటన తిరుపతి జిల్లా రేణిగుంట సమీపంలోని గువ్వల కాలనీలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఇటీవల కాలనీలో పూసలు అమ్ముకునే వ్యక్తిని అతడి భార్య వదిలేసి వెళ్లిపోయింది. ఆ సమయంలో అందరూ నవ్వడంతో ఆ వ్యక్తి అవమానానికి గురయ్యాడు.

నవ్వినవారిలో శ్రీహరి(17) అనే బాలుడు ఉండ‌గా అత‌డిపై దాడి చేశాడు. అనంత‌రం శ్రీహ‌రి తండ్రి బాలుడిని తీసుకెళ్లి ఎందుకు కొట్టావ‌ని గొడ‌వ‌కు దిగాడు. అనంత‌రం అక్క‌డ నుండి తండ్రి వెళ్లిపోగా మ‌రోసారి ఇద్ద‌రూ గొడ‌వ‌ప‌డ్డారు. ఈ క్ర‌మంలో పూస‌ల దారాలు కోసే క‌త్తితో బాలుడి మెడ‌పై దాడి చేశాడు. తీవ్ర గాయాల‌పాలైన బాలుడిని తిరుప‌తి రుయా ఆస్ప‌త్రిలో చేర్పించ‌గా చికిత్స పొందుతూ మ‌ర‌ణించాడు. ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు జ‌రుపుతున్నారు.

Next Story