- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గుర్తుతెలియని వాహనం ఢీకొని మేస్త్రి మృతి
జనగామ జిల్లాలోని దేవరుప్పుల మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.

X
దిశ, పాలకుర్తి: జనగామ జిల్లాలోని దేవరుప్పుల మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. పోలీసుల కథనం ప్రకారం, రామరాజుపల్లి గ్రామానికి చెందిన ఎలగందుల నరసింహ (45) వృత్తిరీత్యా మేస్త్రిగా పనిచేస్తున్నాడు. గురువారం రోజు సాయంత్రం పనులు ముగించుకుని, సింగరాజుపల్లి వద్ద ఉన్న వివేర హోటల్‌లో భోజనం చేసిన అనంతరం రోడ్డు దాటుతున్న సమయంలో అతివేగంగా వచ్చిన గుర్తు తెలియని వాహనం ఢీకొంది.
ఈ ప్రమాదంలో నరసింహ తీవ్రంగా గాయపడి, అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మృతునికి భార్యతో పాటు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. వాహనాన్ని గుర్తించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.
Next Story






