మనుషులు కాదు.. దెయ్యాలు.. తల్లి, తమ్ముడిని నరికి చంపిన వ్యక్తి

by Naga Rani Yarlagadda |

తన తల్లి, తమ్ముడు దెయ్యాలని, తన మనసులో ఏమనుకున్నా వారికి ఇట్టే తెలిసిపోతుందని చంపేశానంటూ పశ్చిమ గోదావరి జిల్లాలో ఓ వ్యక్తి హల్ చల్ చేశాడు.

మనుషులు కాదు.. దెయ్యాలు.. తల్లి, తమ్ముడిని నరికి చంపిన వ్యక్తి
X

దిశ, వెబ్‌డెస్క్: తన తల్లి, తమ్ముడు దెయ్యాలని, తన మనసులో ఏమనుకున్నా వారికి ఇట్టే తెలిసిపోతుందని చంపేశానంటూ పశ్చిమ గోదావరి జిల్లాలో ఓ వ్యక్తి హల్ చల్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలోని సుంకర పద్దయ్య వీధిలో ఈ ఘటన జరిగింది.

37 సంవత్సరాల శ్రీనివాస్ అనే వ్యక్తి.. తన తల్లి మహాలక్ష్మి (60), తమ్ముడు రవితేజ (33)లను కత్తితో పొడిచి అతి కిరాతకంగా హతమార్చాడు. ఆపై అతనే పోలీసులకు ఫోన్ చేసి విషయం చెప్పాడు. తన తల్లి, తమ్ముడు మనుషులు కారని, వాళ్లిద్దరూ దెయ్యాలంటూ హల్ చల్ చేశాడు. తన మనసులో ఉన్న విషయాలను వాళ్లు బయటకు చెప్పేస్తున్నారని, 18 రోజులుగా తిండి కూడా పెట్టకుండా హింసిస్తున్నారని వాపోయాడు.

వాళ్లను చంపుతున్నపుడు కడుపులోకి కత్తు దిగడం లేదని, కడుపులో ఏదో స్ట్రాంగ్ గా ఉందని చెప్పుకొచ్చాడు. వారిద్దరి బాడీలకు పోస్టుమార్టం చేస్తే లోపల ఏం ఉందో తెలుస్తుందన్నాడు. తన తండ్రిని తమ్ముడే చంపేశాడని చెప్పాడు. ఇదంతా అక్కడున్న వారు వీడియో తీయగా.. నెట్టింట వీడియో హల్ చల్ చేస్తోంది. నిజానికి వాళ్లు దెయ్యాలు కాదని, ఇతనికే ఏదో మెంటల్ ఇష్యూ ఉన్నట్లుగా కనిపిస్తున్నాడని నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టమ్ కు పంపారు. శ్రీనివాస్ ను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.

Next Story