Viral video: రూ.500 పందెం కోసం యమునానదిలో దూకాడు.. చివరికి!

by Ajay Maddhiboyina |

కొంత‌మంది తెలిసి చేస్తారో తెలియ‌క చేస్తారో కానీ పిచ్చిపిచ్చి ప‌నులు చేసి ప్రాణాలమీద‌కు తెచ్చుకుంటారు. తాజాగా ఓ యువ‌కుడు అలాంటి పనే చేసే ప్రాణాల మీద‌కు దెచ్చుకున్నాడు.

Viral video: రూ.500 పందెం కోసం యమునానదిలో దూకాడు.. చివరికి!
X

దిశ‌, వెబ్ డెస్క్: కొంత‌మంది తెలిసి చేస్తారో తెలియ‌క చేస్తారో కానీ పిచ్చిపిచ్చి ప‌నులు చేసి ప్రాణాలమీద‌కు తెచ్చుకుంటారు. తాజాగా ఓ యువ‌కుడు అలాంటి పనే చేసే ప్రాణాల మీద‌కు దెచ్చుకున్నాడు. కేవ‌లం రూ.500 పందెం కోసం ఉధృతంగా ప్ర‌వ‌హిస్తున్న న‌దిలో దూకాడు. ఈ ఘ‌ట‌న ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని బాగ్ప‌త్ జిల్లాలో చోటు చేసుకుంది. నివాడా గ్రామానికి చెందిన 19 ఏళ్ల జునైద్ త‌న స్నేహితులతో క‌లిసి బ్రిడ్జి వద్దకు వెళ్లాడు. ఆ సమయంలో స్నేహితులతో పందెం కాయగా వీడియో తీస్తున్న సమయంలో నదిలో దూకేశాడు.

అయితే ప్రస్తుతం భారీ వర్షాల కారణంగా వరద నీరు ఎక్కువగా ఉండటంతో ఈత కొట్టలేక నదీ ప్రవాహంలో గల్లంతయ్యాడు. దీంతో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అత‌డి కోసం గాలింపు చ‌ర్య‌లు చేప‌డుతున్నాయి. ఇప్ప‌టివ‌ర‌కు కూడా అత‌డి ఆచూకీ ల‌భించ‌క‌పోవ‌డంతో కుటుంబ స‌భ్యులు ఆందోళ‌న చెందుతున్నారు. యువ‌కుడిని న‌దిలో దూకేలా ప్రేరేపించిన జునైద్ స్నేహితుల‌పై పోలీసులు కేసు న‌మోదు చేశారు. ఇలాంటి చ‌ర్య‌ల‌ను అస్స‌లు స‌హించ‌బోమ‌ని హెచ్చ‌రించారు. యువ‌కుడు న‌దిలో దిగిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో తెగ‌వైర‌ల్ అవుతోంది. వైరల్ వీడియో

Next Story