- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగిగా నటించి.. రూ. 7 కోట్ల నగదుతో పరారైన వ్యక్తి
కేంద్ర ప్రభుత్వ అధికారిగా నటించిన ఓ వ్యక్తి ఏకంగా రూ. 7 కోట్ల నగదుతో పరారయ్యాడు. ఈ షాకింగ్ దోపిడీ బెంగళూరులో జరిగింది.

దిశ, వెబ్ డెస్క్: కేంద్ర ప్రభుత్వ అధికారిగా నటించిన ఓ వ్యక్తి ఏకంగా రూ. 7 కోట్ల నగదుతో పరారయ్యాడు. ఈ షాకింగ్ దోపిడీ బెంగళూరులో జరిగింది. కేంద్ర ప్రభుత్వ అధికారిలా నటించిన గుర్తు తెలియని వ్యక్తి.. క్యాష్ వాన్‌ను అడ్డగించి సుమారు రూ. 7 కోట్ల నగదుతో పరారయ్యారు. ఈ ఘటన నవంబర్ 19న అశోక పిలర్ ప్రాంతంలో చోటుచేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. JP నగర్‌లోని ఒక బ్యాంక్ బ్రాంచ్ నుంచి నగదును ఇతర ప్రాంతాలకు తరలిస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. ప్రాథమిక దర్యాప్తు వివరాల ప్రకారం.. ఒక కారులో ప్రభుత్వ చిహ్నం (Government of India) స్టిక్కర్ వేసుకుని వచ్చిన నిందితుడు.. క్యాష్ వాన్‌ను ఆపాడు. “డాక్యుమెంట్లు వెరిఫై చేయాలి” అని చెబుతూ వాహన సిబ్బందిని నమ్మించాడు. అనంతరం వారికి మోసం చేసి వాన్‌లో ఉన్న భారీ మొత్తాన్ని దొంగిలించి కారులో వేసుకొని తప్పించుకున్నాడు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల గుర్తింపు కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టారు.






