చేపల కోసం చెరువులోకి వెళ్లిన వ్యక్తి ప్రమాదవశాత్తు మృతి

by Bhanu |

పాలకవీడు మండలంలోని కోమటికుంట గ్రామంలో చేపలు పట్టేందుకు చెరువులోకి వెళ్లిన వ్యక్తి ప్రమాదవశాత్తూ నీటిలో పడి మృతి చెందిన

చేపల కోసం చెరువులోకి వెళ్లిన వ్యక్తి ప్రమాదవశాత్తు మృతి
X

దిశ నేరేడుచర్ల (పాలకవీడు) : పాలకవీడు మండలంలోని కోమటికుంట గ్రామంలో చేపలు పట్టేందుకు చెరువులోకి వెళ్లిన వ్యక్తి ప్రమాదవశాత్తూ నీటిలో పడి మృతి చెందిన ఘటన కలకలం రేపుతోంది. గురువారం సాయంత్రం జరిగిన ఈ ఘటన వివరాల ప్రకారం, కోమటికుంట గ్రామానికి చెందిన రాతి కింది లింగయ్య (57) ఊర చెరువులో చేపలు పట్టేందుకు లారీ ట్యూబ్ పైకి ఎక్కి చెరువులోకి దిగాడు. అయితే అదే సమయంలో ఊహించని విధంగా భారీ ఈదురు గాలులు మరియు వర్షం ప్రారంభమవడంతో ట్యూబ్ అదుపుతప్పి, లింగయ్య నీటిలో పడిపోయాడు.

ఘటనను అక్కడే ఉన్న కొందరు గుర్తించి వెంటనే ఆయన కుటుంబ సభ్యులకు మరియు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే నేరేడుచర్ల పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని గాలింపు చర్యలు ప్రారంభించారు. అయితే అతను మునిగిపోయినప్పటి నుంచి మృతదేహం వెలికి తీయడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. గ్రామస్థులు విషాదంలో మునిగిపోయారు.

Next Story