చెరువులో పడి వ్యక్తి మృతి.. మల్హర్ మండలంలో విషాదం

by Bhanu |

మల్హర్ మండలం కొయ్యూరులో మంగళవారం ఉదయానికి చెరువులో పడి ఒకరు మృతి చెందిన విషాదకర సంఘటన జరిగింది.

చెరువులో పడి వ్యక్తి మృతి..  మల్హర్ మండలంలో విషాదం
X

దిశ, మల్హర్: మల్హర్ మండలం కొయ్యూరులో మంగళవారం ఉదయానికి చెరువులో పడి ఒకరు మృతి చెందిన విషాదకర సంఘటన జరిగింది. గ్రామస్థులు , పోలీసుల కథనం ప్రకారం, కొయ్యూరు గ్రామానికి చెందిన కోలకాని సామి (38) సోమవారం బహిర్భూమికి వెళ్లిన తర్వాత తిరిగి ఇంటికి రాలేదు.

కుటుంబ సభ్యులు, గ్రామస్తులు గాలింపు చేపట్టగా, రాత్రి సమయానికి చెరువులో సామి మృతదేహం కనిపించింది. సమాచారం అందుకున్న కొయ్యూరు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మంగళవారం శవపంచనామా నిర్వహించారు. మృతుని భార్య పుష్ప ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు. కోలకాని సామి తాపీ మేస్త్రిగా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అతనికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ఈ అకాల మరణం గ్రామంలో విషాదాన్ని మిగిల్చింది.


Next Story