- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి..
అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి చెందిన సంఘటన పెద్దవూర మండలం పెద్దగూడెం గ్రామంలో గురువారం జరిగింది.

దిశ, పెద్దవూర: అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి చెందిన సంఘటన పెద్దవూర మండలం పెద్దగూడెం గ్రామంలో గురువారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దవూర మండలం పెద్దగూడెం గ్రామానికి చెందిన జానపాటి కోటేష్(33)కు 2015 సంవత్సరంలో నిడమనూరు మండలం కుంటి గొర్లగూడెం గ్రామానికి చెందిన హేమలతతో వివాహమైంది. వారికి కారుణ్య(10), తనుశ్రీ(8) అను ఇద్దరు అమ్మాయిలు సంతానం కలరు. పెళ్లి అయిన కొంతకాలం తర్వాత భార్య భర్తలిద్దరి మధ్యన గొడవలు రావడంతో గత ఆరు నెలల నుండి కోటేష్ భార్య హేమలత తన పిల్లలతో సహా తల్లి గారి ఇంటికి వెళ్లి అక్కడే ఉంటుంది.
నిన్నటి రోజు అనగా తేదీ 29.01. 2025 గురువారం రోజున సాయంత్రం అందాజ ఏడు గంటల సమయంలో సదరు కోటేష్ తన ఇంట్లో గొంతుపై తీవ్రమైన రక్త గాయంతో పడి మరణించి ఉండడాన్ని చుట్టుపక్కల వారు గమనించి, మృతుని భార్య అయిన జానపాటి హేమలతకు సమాచారం తెలియపరిచారు. తన భర్త చనిపోయిన విషయం తెలుసుకున్న హేమలత వారి కుటుంబ సభ్యులతో వచ్చి మృతుడిని చూసి, అనంతరం శవాన్ని నాగార్జునసాగర్ ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. మృతుడి భార్య హేమలత ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. ఇక కేసు విచారణలో భాగంగా నల్గొండ నుండి క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్‌ను పిలిపించి నేరస్థలంలో దొరికిన చాకును స్వాధీనం చేసుకుని కేసును నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించడమైందని ఎస్ ఐ ప్రసాద్ తెలిపారు.






