కారు బైక్ ను ఢీకొట్టడంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి

by Taduka Kalyani |

కారు బైక్ ను ఢీ కొట్టగా ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన చిన్నశంకరంపేట మండలం చందంపేట శివారు ప్రాంతంలో సోమవారం రాత్రి 6 గంటలకు ప్రాంతంలో చోటుచేసుకుంది.

కారు బైక్ ను ఢీకొట్టడంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి
X

దిశ, చిన్నశంకరంపేట: కారు బైక్ ను ఢీ కొట్టగా ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన చిన్నశంకరంపేట మండలం చందంపేట శివారు ప్రాంతంలో సోమవారం రాత్రి 6 గంటలకు ప్రాంతంలో చోటుచేసుకుంది. స్థానిక ఎస్సై శివానందం కథనం ప్రకారం... తూప్రాన్ మండలం కోనాయిపల్లి గ్రామానికి చెందిన దరిపల్లి నాగరాజు (40) తన బైక్ పై చేగుంట వైపు వెళ్తుండగా, చిన్న శంకరంపేట మండల కేంద్రానికి చెందిన ఎర్రి స్వామి చేగుంట నుండి చిన్న శంకరంపేట వైపు కారు నడిపిస్తూ బైకును ఢీ కొట్టడంతో బైక్ పై ఉన్న నాగరాజు అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు. కారు పంట పొలాల్లోకి దూసుకుపోయింది. కారులోని డ్రైవర్ స్వామికి స్వల్ప గాయాలు అయ్యాయని తెలిపారు. సంఘటన స్థలానికి ఎస్సై శివానందం వెళ్లి శవాన్ని పంచనామా చేసి పోస్టుమార్టం నిమిత్తం రామాయంపేట ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Next Story