వడదెబ్బతో వ్యక్తి మృతి

by Ratna Kumari |

హుజూరాబాద్ మండలంలో వడదెబ్బ కారణంగా ఓ వ్యక్తి మృతి చెందాడు.

వడదెబ్బతో వ్యక్తి మృతి
X

దిశ,​ హుజూరాబాద్ రూరల్ : హుజూరాబాద్ మండలంలో వడదెబ్బ కారణంగా ఓ వ్యక్తి మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని సింగాపూర్ గ్రామానికి చెందిన నీరటి రమేష్ (45) అనే వ్యక్తి గత రెండు రోజులుగా పనుల నిమిత్తం తీవ్రమైన ఎండలో తిరిగారు. ఈ క్రమంలో మంగళవారం ఆయన తీవ్ర అస్వస్థతకు గురై మృతి చెందారు. రమేష్ మరణంతో సింగాపూర్ గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. ​​మృతి చెందిన నీరటి రమేష్ కుటుంబం అత్యంత పేదరికంలో ఉందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. సంపాదించే వ్యక్తిని కోల్పోయి రోడ్డున పడిన ఆ నిరుపేద కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని, తగిన ఆర్థిక సహాయం అందించి అండగా నిలవాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.

Next Story