- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వడదెబ్బతో వ్యక్తి మృతి..
by Batti.Sumithra |
వడదెబ్బతో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన గోపులారం గ్రామంలో జరిగింది.

X
దిశ, శంకర్పల్లి : వడదెబ్బతో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన గోపులారం గ్రామంలో జరిగింది. ఈ సంఘటనకు సంబంధించి పూర్తివివరాల్లోకెళితే గోపులారం గ్రామానికి చెందిన చీమలి వెంకటయ్య (55) గ్రామంలోని ఫామ్ హౌస్ లోని తోటలో పనిచేస్తూ జీవనం సాగించేవాడు. ఆదివారం సాయంత్రం గం. 5లకు అస్వస్థత గురి కావడంతో కుటుంబీకులు వెంటనే శంకర్పల్లిలోని లలిత ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి తీసుకువచ్చిన కొద్దిసేపటికి వెంకటయ్య మృతి చెందాడు. వడదెబ్బతో మృతి చెందాడని డాక్టర్లు తెలపడంతో కుటుంబీకులు శవాన్ని ఇంటికి తరలించారు. అతడికి భార్య చంద్రకళ, ఇద్దరు కూతుర్లు, ఓ కుమారుడు ఉన్నారు.
Next Story






