- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎల్బీనగర్ వద్ద రోడ్డు ప్రమాదం.. బైకర్ అక్కడికక్కడే మృతి
by Bhanu |
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన సంఘటన ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.

X
దిశ, చైతన్యపురి : రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన సంఘటన ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. సీఐ వినోద్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం బడంగ్ పేట సాయి నగర్ కాలనీలో నివసించే గౌర సంపత్ కుమార్ (42) కొత్తపేట నుండి ఎల్బీనగర్ వైపు మంగళవారం తన మోటార్ సైకిల్ పై వస్తున్నాడు.
ఈ నేపథ్యంలో గుర్తు తెలియని వాహనం ఎల్బీనగర్ మెట్రో స్టేషన్ పిల్లర్ నెంబర్ 1677 వద్ద సంపత్ కుమార్ వస్తున్న బైక్ ను ఢీ కొట్టగా అక్కడికక్కడే మృతిచెందాడు. సంపత్ కుమార్ స్నేహితుడు ప్రభాకర్ పోలీసులకు సమాచారం అందించగా సంఘటనా స్థలానికి చేరుకుని పంచనామా చేశారు. మృతుడి తల్లి మణెమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
Next Story






