- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆటో ముందు చక్రం ఊడి వ్యక్తి మృతి..
by Batti.Sumithra |
మొర్రి గూడ గ్రామం సమీపంలో చింతగూడ గ్రామానికి చెందిన బాలు నాయక్ (57) అనే వ్యక్తి గురువారం రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు.

X
దిశ, జన్నారం : మొర్రి గూడ గ్రామం సమీపంలో చింతగూడ గ్రామానికి చెందిన బాలు నాయక్ (57) అనే వ్యక్తి గురువారం రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. జన్నారం ఎస్సై పి.సతీష్ తెలిపిన వివరాల ప్రకారం బాలునాయక్ ఉట్నూర్ లో పనులు ముగించుకుని చింతగూడకు ఆటోలో వస్తున్నాడు.
సరిగ్గా జన్నారం మండలంలోని మొర్రిగూడ ఐబీ వద్ద ఆటోలో వెళుతుండగా ఆటో ముందు టైరు ఒక్కసారిగా ఊడిపోయింది. దీంతో ఆటో అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో బాలు నాయక్ తలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందాడని ఎస్సై తెలిపారు. మృతుని భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.
Next Story






