- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం
by Kema Shiva Kumar |
రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం పాలైన ఘటన రాయికల్ మండలం వడ్డెర కాలనీలో ఆదివారం చోటుచేసుకుంది.

X
దిశ, రాయికల్ : రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం పాలైన ఘటన రాయికల్ మండలం వడ్డెర కాలనీలో ఆదివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మల్లాపూర్ మండలం వీవీరావు పేటకు చెందిన కలాలి నర్సయ్య తన వ్యక్తిగత పని నిమిత్తం బైక్ పై కడెం మండలం లక్ష్మిసాగర్ గ్రామంలో ఉన్న తన బంధువుల ఇంటికి వెళ్లాడు. పని ముగించుకుని తిరిగి స్వగ్రామానికి బయలుదేరిన నర్సయ్య రాయికల్ మండలం వడ్డెర కాలనీ వద్దకు రాగానే ఎదురుగా అతివేగంతో వస్తున్న ట్రాక్టర్ నర్సయ్య బైక్ ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నర్సయ్య తలకు బలమైన గాయాలయ్యాయి. తీవ్ర రక్తస్రావంతో అతను అక్కడకక్కడే మృతి చెందాడు. మృతుడి సోదరుడు కలాలి నడిపి రాజయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి భార్య ఇటీవలే చనిపోగా.. కుమారుడు దుబాయిలో ఉంటున్నాడు.
Next Story






