- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి..
by Batti.Sumithra |
ఇబ్రహీంపట్నం మండలం బొమ్మల మేడిపెల్లి వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా, మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి..

X
దిశ, ఇబ్రహీంపట్నం : ఇబ్రహీంపట్నం మండలం బొమ్మల మేడిపెల్లి వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా, మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి.. ఎస్సై ఉమసాగర్ తెలిపిన వివరాల ప్రకారం బొమ్మల మేడిపల్లి గ్రామంలో ఓ కిరాణా దుకాణంలో కూల్ డ్రింక్స్ వేసి రోడ్డుపైకి టాటా గూడ్స్ వాహనం బయలుదేరింది. కాగా మెట్ పల్లి నుండి ద్విచక్ర వాహనం పై మోర్తాడ్ కు వెళ్తున్న మాడ హనుమండ్లు (40), దుర్గి లక్ష్మణ్ (40) అనే వ్యక్తులు ఇద్దరు ద్విచక్ర వాహనం పై వచ్చి టాటా గూడ్స్ వాహనాన్ని ఢీకొనడంతో హనుమండ్లు అక్కడికక్కడే మృతి చెందగా, లక్ష్మణ్ కు తీవ్ర గాయాలు కాగా నిజామాబాద్ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించినట్లు ఎస్సై ఉమాసాగర్ తెలిపారు.
Next Story






