పాముకాటుతో వ్యక్తి మృతి

by Nallavelli.Anjaneyulu |

దిశ, మందమర్రి : మందమర్రి మండలంలోని చిర్రకుంట గ్రామంలో పొలంలో పనిచేస్తుండగా పాముకాటుకు గురైన రైతు, చికిత్స పొందుతూ

పాముకాటుతో వ్యక్తి మృతి
X

దిశ, మందమర్రి : మందమర్రి మండలంలోని చిర్రకుంట గ్రామంలో పొలంలో పనిచేస్తుండగా పాముకాటుకు గురైన రైతు, చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చిర్రకుంట గ్రామానికి చెందిన కంది ముకుంద రెడ్డి (60) వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ నెల 3న సాయంత్రం ముకుంద రెడ్డి చిర్రకుంట శివారులోని తన పొలంలో వరి పంట కోస్తుండగా, ఒక్కసారిగా పాము వచ్చి అతడి ఎడమ కాలి పాదం పైభాగంలో కాటేసింది. వెంటనే అప్రమత్తమైన తోటి రైతులు అతడిని చికిత్స కోసం మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ రెండు రోజులుగా చికిత్స పొందుతున్న ముకుంద రెడ్డి పరిస్థితి విషమించడంతో, శుక్రవారం తుదిశ్వాస విడిచారు. మృతుడికి భార్య, కూతురు, కొడుకు ఉన్నారు. ఈ సంఘటనపై మృతుడి అన్న కొడుకు కంది నరేందర్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మందమర్రి ఏఎస్ఐ మాజీద్ ఖాన్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Next Story