- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హాస్పిటల్ యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగా వ్యక్తి మృతి..కుటుంబ సభ్యుల ఆందోళన
సామాన్యులు ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లాలంటేనే భయాందోళన పరిస్థితి ఏర్పడుతుంది.

దిశ, ఖైరతాబాద్ : సామాన్యులు ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లాలంటేనే భయాందోళన పరిస్థితి ఏర్పడుతుంది. డబ్బుల కోసం ప్రాణాలతో చెలగాటం ఆడుతు దారుణాలకు ఒడి కడుతున్నాయి కొన్ని ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలు. ఇలాంటి ఘటనే ఒకటి ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి..రక్త ప్రసరణ జరిగే వాళ్స్ బ్లాక్ సమస్యతో కోదాడకు చెందిన ఎస్.కె మౌలానా(35)ను చికిత్స నిమిత్తం అమీర్పేటలోని ఆస్టర్ ప్రైమ్ ఆసుపత్రిలో వారం రోజుల క్రితం ఆయన కుటుంబ సభ్యులు చేర్పించారు. మూడు రోజులు క్రితం సర్జరీ చేశారు. అనంతరం అధికంగా బ్లీడింగ్ అవుతుందని 8 యూనిట్ల రక్తం అవసరమంటే అత్యవసరంగా 8 యూనిట్ల రక్తాన్ని తెచ్చి ఇచ్చినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. వెంటిలేటర్ పై ఉన్న మౌలానాను కనీసం కుటుంబ సభ్యులను చూడనివ్వకుండా గురువారం పేషెంట్ కండిషన్ బాగోలేదని చెప్పి ఉదయం చనిపోయాడని వైద్యులు తెలిపినట్లు అన్నారు. 35 సంవత్సరాల ఎస్ కే మౌలానా తన రోజువారీ కార్యకలాపాలు చాలా చురుగ్గా నిర్వహించుకునే వాడని చికిత్స నిమిత్తం ఆరోగ్యంగా వచ్చిన మౌలానాను ఆస్టర్ ప్రైమ్ హాస్పిటల్ వారు చంపేశారని ఆరోపిస్తున్న కుటుంబ సభ్యులు ఆవేదనకు లోనయ్యారు. మౌలానకు ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు. ఆసుపత్రి నిర్లక్ష్యం కారణంగా కుటుంబం మొత్తం రోడ్డు మీదికి వచ్చిందని ఆరోపించారు.






