ఉరేసుకుని వ్యక్తి మృతి

by Nallavelli.Anjaneyulu |

మతిస్థిమితం లేని వ్యక్తి ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన మండ‌ల ప‌రిధిలో చోటు చేసుకుంది.

ఉరేసుకుని వ్యక్తి మృతి
X

దిశ, ఉండవెల్లి : మతిస్థిమితం లేని వ్యక్తి ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన మండ‌ల ప‌రిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ శేఖర్ తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. ఉండవెల్లి మండలం బొంకూరు గ్రామానికి చెందిన బొయ్య నాగమ్మ చిన్న కుమారుడు బోయకర్ణ (31), మతిస్థిమితం సరిగ్గా లేకుండా పిచ్చిపిచ్చిగా ప్రవర్తించేవాడు. అలాగే మద్యం అలవాటు కూడా ఉండేది. బుధవారం రాత్రి అందరూ కలిసి భోజనం చేసి నిద్రపోయారు. ఉదయం లేచి చూసేసరికి బోయకర్ణ ఉరి వేసుకుని మృతి చెంది ఉన్నాడు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.

Next Story