- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వంతెన పైనుంచి దూకి వ్యక్తి మృతి...
by Taduka Kalyani |
ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ గ్రామానికి చెందిన పల్లపు భూమన్న (35) అనే వ్యక్తి వెల్గటూర్ లోని పెద్దవాగు వంతెనపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడి మృతి చెందాడని ఎస్సై ఉదయ్ కుమార్ తెలిపారు.

X
దిశ, వెల్గటూర్ : ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ గ్రామానికి చెందిన పల్లపు భూమన్న (35) అనే వ్యక్తి వెల్గటూర్ లోని పెద్దవాగు వంతెనపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడి మృతి చెందాడని ఎస్సై ఉదయ్ కుమార్ తెలిపారు. కొంతకాలంగా మద్యానికి బానిసై మానసిక స్థితి సరిగా లేక భూమన్న విచిత్రంగా ప్రవర్తిస్తూ, కుటుంబ సభ్యులను కారణం లేకుండా దుర్భాష లాడేవాడు. ఈ నెల 24న పని ఉందని ఇంటి నుంచి వెళ్లిన భూమన్న, అదే రోజు రాత్రి వెల్గటూర్ శివారులోని బ్రిడ్జిపై నుంచి నీటిలోకి దూకి చనిపోయాడు. తన భర్త మద్యానికి బానిసై మానసిక స్థితి కోల్పోవడం వల్ల ఆత్మహత్యకు పాల్పడ్డాడని, అతని మరణంపై ఎవరి పట్ల ఎలాంటి అనుమానం లేదని భార్య పల్లపు లక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి, శవ పంచనామా చేసి దర్యాప్తు ప్రారంభించారు.
Next Story






