- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

దిశ, సంగారెడ్డి అర్బన్ : ప్రమాదవశాత్తు చెరువులో పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లా కంది మండల పరిధిలో శుక్రవారం ఉదయం వెలుగు చూసింది. సంగారెడ్డి రూరల్ ఎస్సై రవీందర్ తెలిపిన వివరాల ప్రకారం.. కౌలంపేట గ్రామానికి చెందిన మున్నూరు జగన్ (40) స్థానికంగా వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నాడు. ఈ మధ్యనే ఇతడికి ఉన్న కొంత భూమిని కూడా అమ్ముకున్నాడు. ఇతడికి ఓ భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. అయితే గురువారం రాత్రి జగన్ ఊదం చెరువు వద్ద కాలకృత్యాలు తీసుకోవడానికి వెళ్లి ప్రమాదవశాత్తు అందులో పడి మృతి చెందాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు. మృతుడైన జగన్ ఎవరితో సరిగా కలిసిమెలిసి ఉండే వాడు కాదని, మద్యానికి బానిసైన అతడు ఒంటరిగా ఎప్పుడు చెరువు గట్టున ఉన్న శివాలయం వద్దే ఉండేవారని స్థానికులు చెబుతున్నారు.






