- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వాటర్ బాటిల్ అనుకొని కెమికల్ సేవించి వ్యక్తి మృతి
వాటర్ బాటిల్ అనుకొని కెమికల్ సేవించి వ్యక్తి మృతి చెందిన ఘటన చౌటుప్పల్ మండలం ఎల్లగిరి గ్రామంలో చోటు చేసుకుంది.

దిశ, చౌటుప్పల్ టౌన్ : వాటర్ బాటిల్ అనుకొని కెమికల్ సేవించి వ్యక్తి మృతి చెందిన ఘటన చౌటుప్పల్ మండలం ఎల్లగిరి గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. చౌటుప్పల్ మండలం ఖైతాపురం గ్రామానికి చెందిన గుడ్డేటి రవి (43) అనే వ్యక్తి ప్రమాదవశాత్తు కెమికల్ సేవించి మృతి చెందాడు. ఖాళీగా ఉన్న సమయంలో మండల పరిధిలోని ఎల్లగిరి గ్రామంలోని కోళ్ల ఫారం షెడ్‌లో రాత్రి డ్యూటీకి వెళ్లే రవి.. మంగళవారం రాత్రి కూడా విధులకు హాజరయ్యాడు. అయితే బుధవారం తెల్లవారుజామున నిద్రలేచి వాటర్ బాటిల్ అనుకొని 'సర్మోలిన్' అనే కెమికల్ ద్రావణాన్ని పొరపాటున సేవించాడు. కొద్దిసేపటికే తీవ్ర కడుపు మంటగా ఉందని చెప్పడంతో అక్కడున్న సహోద్యోగులు అతడిని వెంటనే చౌటుప్పల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం ఉస్మానియా ఆసుపత్రికి రిఫర్ చేయగా, చికిత్స పొందుతూ ఆసుపత్రిలోనే రవి తుది శ్వాస విడిచాడు. ఈ ఘటనపై మృతుడి అన్న కొడుకు గుడ్డేటి లవ కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్.ఐ. కృష్ణమాల్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.






