వైన్స్ పర్మిట్ రూమ్‌లో మద్యం తాగుతూ వ్యక్తి మృతి

by Chintha Aamani |

ఓ వ్యక్తి వైన్స్ పర్మిట్ రూంలో మద్యం తాగుతూ మృతి చెందిన సంఘటన శంషాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

వైన్స్ పర్మిట్ రూమ్‌లో మద్యం తాగుతూ వ్యక్తి మృతి
X

దిశ, రాజేంద్రనగర్: ఓ వ్యక్తి వైన్స్ పర్మిట్ రూంలో మద్యం తాగుతూ మృతి చెందిన సంఘటన శంషాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ నరేందర్ రెడ్డి కథనం ప్రకారం.. కొత్తూరు మండలం అక్కినేనిగూడకు చెందిన సోలిపురం సాయిలు(47), సువర్ణ దంపతులు. సాయిలు కూలి పని చేస్తుంటాడు. మిగతా సమయంలో ఖాళీగా ఉండేవాడు. ఈ క్రమంలో సాయిలు గురువారం సాయంత్రం తన భార్య సువర్ణను తాను పనిచేస్తున్న తిమ్మాపూర్ సమీపంలో ఉన్న ఓ కంపెనీ వద్ద బైకుపై వదిలేసి వచ్చాడు. సాయంత్రం అతడు శంషాబాద్ మండల పరిధిలోని కవేలిగూడ దగ్గర ఉన్న వైన్స్ పర్మిట్ రూమ్ లో మద్యం తాగుతూ చనిపోయాడు. దీంతో పోలీసుల సమాచారం మేరకు సువర్ణ అక్కడికి చేరుకుంది. మద్యం తాగుతూ తన భర్త మృతి చెందాడని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ నరేందర్ రెడ్డి తెలిపారు.

Next Story