కొడుకు పెళ్లిలో డ్యాన్స్ చేసి.. అంతలోనే మృత్యు లోకాలకు

by Ajay Maddhiboyina |

శ్రీ సత్యసాయి జిల్లా కనగానపల్లిలో పెళ్లింట విషాదం నిండుకుంది. అప్పటి వరకు ఎంతో సంతోషంగా గడిపిన తండ్రి కుమారిడి పెళ్లిరోజే మరణించడంతో కుటుంబంలో విషాద చాయలు అలుముకున్నాయి.

కొడుకు పెళ్లిలో డ్యాన్స్ చేసి.. అంతలోనే మృత్యు లోకాలకు
X

దిశ, వెబ్ డెస్క్: శ్రీ సత్యసాయి జిల్లా కనగానపల్లిలో పెళ్లింట విషాదం నిండుకుంది. అప్పటి వరకు ఎంతో సంతోషంగా గడిపిన తండ్రి కుమారిడి పెళ్లిరోజే మరణించడంతో కుటుంబంలో విషాద చాయలు అలుముకున్నాయి. పెనుగొండ మండలం గుట్టూరుకు చెందిన యువతికి అదే మండలానికి చెందిన శివానందతో ఆదివారం వివాహం జరిగింది.

కాగా పెళ్లి అనంతరం డీజే ముందు అందరూ డ్యాన్స్ చేస్తుండగా అబ్బాయి తండ్రి సైతం హుషారుగా స్టెప్పులు వేశాడు. అయితే తరవాత మద్యం మత్తులో ఉన్న అతడు డీజే వాహనం కిందపడిపోవడంతో తీవ్రగాయాలు అయ్యాయి. దీంతో అక్కడిక్కడే మృతి చెందాడు. ప్ర‌స్తుతం మ‌ర‌ణించ‌క‌ముందు అత‌డు డ్యాన్స్ చేసిన వీడియోలు స్థానికంగా సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. అత‌డు పెళ్లిలో గ‌డిపిన క్ష‌ణాల‌ను గుర్తు చేసుకుని కుటుంబ స‌భ్యులు క‌న్నీటి ప‌ర్యంత‌మ‌వుతున్నారు.

Next Story