- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తల్లి అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి ఆత్మహత్య
తల్లి అనారోగ్యంతో ఉండటం.. తాను ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నానని ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మండల పరిధిలోని వడ్డేపల్లి గ్రామంలో చోటు చేసుకుంది.

దిశ, నిజాంసాగర్ : తల్లి అనారోగ్యంతో ఉండటం.. తాను ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నానని ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మండల పరిధిలోని వడ్డేపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్సై శివకుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. నిజాంసాగర్ మండలం వడ్డేపల్లి గ్రామంలో విషాద సంఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన కుంటోళ్ల సాయిలు (50) తన నివాసంలో నిన్న పురుగుల మందు సేవించాడు. కుటుంబ సభ్యులు వెంటనే హైదరాబాద్ లోని గాంధీ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆదివారం సాయిలు మృతి చెందాడు. సాయి తన తల్లి అనారోగ్యం.. ప్రేమవివాహం అనంతరం ఉద్యోగం లేకపోవడంతో కుటుంబం పై ఆర్థిక భారం పెరగడంతో తీవ్ర మనస్థాపానికి గురవ్వడంతో ఈ సంచలన నిర్ణయంతీసుకున్నట్టు స్థానికులు భావిస్తున్నారు. సాయిలు కుమారుడు మహేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై శివకుమార్ తెలిపారు.






