- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఫ్యాన్ కు ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్య...
by Taduka Kalyani |
ఓ వ్యక్తి మద్యానికి బానిసై ఆరోగ్య సమస్యలు చుట్టుముట్టడంతో మనస్థాపం చెంది ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మారేడుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.

X
దిశ, కంటోన్మెంట్/బోయిన్ పల్లి: ఓ వ్యక్తి మద్యానికి బానిసై ఆరోగ్య సమస్యలు చుట్టుముట్టడంతో మనస్థాపం చెంది ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మారేడుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్సై రవికుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈస్ట్ మారేడ్ పల్లికి చెందిన శ్రీనివాస్ (55) పది సంవత్సరాల క్రితం ప్రైవేట్ ఉద్యోగం చేసి మానేసి మద్యానికి బానిస అయ్యాడు.
దీంతో అనారోగ్యం బారిన పడటంతో మనస్థాపానికి గురై బుధవారం సాయంత్రం తన ఇంటి మేడపైన ఉన్న గదిలో చీరతో ఫ్యాన్ కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది గమనించిన స్థానికులు 108 అంబులెన్స్ సహాయంతో గాంధీ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే శ్రీనివాస్ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






