అక్రమసంబంధం పెట్టుకున్న మహిళ వేధింపులతో యవకుడి ఆత్మహత్య

by Ajay Maddhiboyina |

వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళ వేధింపులకు గురి చేయడంతో మహిళ ఆత్మహత్య చేసుకుంది.

అక్రమసంబంధం పెట్టుకున్న మహిళ వేధింపులతో యవకుడి ఆత్మహత్య
X

దిశ‌, వెబ్ డెస్క్: వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళ వేధింపులకు గురి చేయడంతో మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండలం ఐనాపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన దండు భానుచందర్ (28) అనే యువకుడు రెండు రోజుల క్రితం పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే చ‌నిపోయే ముందు త‌మ ఇంటి ముందు ఉండే మ‌హిళ టార్చర్ చేయ‌డం వ‌ల్ల పురుగుల మందు తాగిన‌ట్టు త‌న సోద‌రుడు చెప్పాడ‌ని మృతుడి సోద‌రి ఆవేద‌న వ్య‌క్తం చేసింది. కొంత‌కాలంగా త‌న‌ను మ‌హిళ వేధింపుల‌కు గురి చేసింద‌ని అందుకే త‌ట్టుకోలేక ఆత్మ‌హ‌త్య చేసుకున్న‌ట్టు చెప్పాడ‌ని తెలిపింది. యువ‌కుడు మృతి చెంద‌డంతో మృతదేహాన్ని కుటుంబ స‌భ్యులు ఆమె ఇంటిముందు పెట్టి నిర‌స‌న వ్య‌క్తం చేశారు. గ్రామ‌స్తులు అంతా అక్క‌డ‌కు చేరుకుని యువ‌కుడి కుటుంబానికి న్యాయం చేయాల‌ని డిమాండ్ చేయ‌డంతో గ్రామంలో ఉద్రిక్త వాతావ‌ర‌ణం నెల‌కొంది. దీంతో ఘ‌ట‌నాస్థ‌లంలో పోలీసులు మోహ‌రించారు.

Next Story