అనారోగ్యమని వెళితే క్షుద్రపూజల పేరుతో రూ.3.50 కోట్లు కొట్టేశాడు

by Ajay Maddhiboyina |

అనారోగ్యం బారినపడి మాంత్రికుడి వద్దకు వెళితే క్షుద్రపూజల పేరుతో రూ.3.50 కోట్లు కొట్టేశాడు. ఈ ఘటన ఏపీలోని ఆదోనిలో చోటు చేసుకుంది. తెలంగాణలోని పెచ్చెరు ప్రాంతానికి చెందిన దంపతులు అనారోగ్యం బారినపడటంతో ఆదోని మండలం బైలిగేరి గ్రామానికి చెందిన దుర్గాసింగ్ అనే వ్యక్తిని కలిశారు.

అనారోగ్యమని వెళితే క్షుద్రపూజల పేరుతో రూ.3.50 కోట్లు కొట్టేశాడు
X

దిశ, వెబ్ డెస్క్: అనారోగ్యం బారినపడి మాంత్రికుడి వద్దకు వెళితే క్షుద్రపూజల పేరుతో రూ.3.50 కోట్లు కొట్టేశాడు. ఈ ఘటన ఏపీలోని ఆదోనిలో చోటు చేసుకుంది. తెలంగాణలోని పెచ్చెరు ప్రాంతానికి చెందిన దంపతులు అనారోగ్యం బారినపడటంతో ఆదోని మండలం బైలిగేరి గ్రామానికి చెందిన దుర్గాసింగ్ అనే వ్యక్తిని కలిశారు. ఈ క్రమంలో మీ పొలంలో నిధి ఉంది అంటూ నమ్మించాడు. నిధిని బయటకు తీయకుంటే మీ పిల్లలకు ప్రాణహాని ఉందని హెచ్చరించాడు. నిధిని బయటకు తీసేందుకు మొత్తం రూ.3 కోట్ల వరకు డిమాండ్ చేయగా ఆ దంపతులు అడిగిన మొత్తాన్ని విడతల వారిగా ఇచ్చారు.

ఓ రోజు పొలంలో క్షుద్రపూజలు చేసి అమ్మవారి విగ్రహాన్ని తీశాడు. అది ఇంట్లో పెట్టుకుంటే డబ్బులు వస్తాయని, అమ్మితే కోట్ల రూపాయలు వస్తాయని నమ్మించాడు. మాంత్రికుడిని నమ్మిన దంపతులు అతడికి డబ్బులు ఇవ్వడంతో పాటు విగ్రహం అమ్మడం కోసం ఢిల్లీకి విదేశాల నుండి వస్తున్నారంటే పలుమార్లు డబ్బులు ఖర్చు చేసి అతడితో వెళ్లారు. చివరికి తాము మోసపోయామని గ్రహించిన దంపతులు ప్రజాదర్బార్ లో ఎమ్మెల్యే పార్థసారథిని కలిసి తమ బాధను చెప్పుకున్నారు. ఎమ్మెల్యే కేసును విచారించి వారికి న్యాయం చేయాలని డీఎస్పీని ఆదేశించారు.

Next Story