తెలంగాణలో దారుణం.. వ్యక్తి ప్రాణాలు తీసిన వాట్సాప్ ఎమోజీ

by Gantepaka Srikanth |

ప్రస్తుత రోజుల్లో పదిమందిలో అవమానిస్తున్నా భరిస్తున్నారు కానీ.. సోషల్ మీడియాలో ఎమోజీ(WhatsApp Emoji)లో రియాక్ట్ అయితే మాత్రం తట్టుకోలేకపోతున్నారు.

తెలంగాణలో దారుణం.. వ్యక్తి ప్రాణాలు తీసిన వాట్సాప్ ఎమోజీ
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత రోజుల్లో పదిమందిలో అవమానిస్తున్నా భరిస్తున్నారు కానీ.. సోషల్ మీడియాలో ఎమోజీ(WhatsApp Emoji)లో రియాక్ట్ అయితే మాత్రం తట్టుకోలేకపోతున్నారు. ఉదాహరణకు ‘థంబ్’ ఎమోజీ ఇస్తే.. ఎక్కడలేని కోపానికి వస్తున్నారు. అవి కాస్త మితిమీరిపోతున్నాయి. తాజాగా ఇలాంటి ఘటనే తెలంగాణలో చోటుచేసుకుంది. సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఆగస్టు 3వ తేదీన పద్మశాలి సంఘం ఎన్నికలు నిర్వహించాలని కుల సంఘం సభ్యులు నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత పద్మశాలి సంఘం అధ్యక్షుడిగా ఉన్న అప్పం శ్రీనివాస్‌కు, ఇటీవల నామినేషన్ వేసిన రాములకు తీవ్ర విబేధాలు కొనసాగుతుండగా, శ్రీనివాస్‌పై రాములు తీవ్ర విమర్శలు చేశారు. రాములు తనపై చేస్తున్న ఆరోపణలకు "సూర్యాపేట పట్టణ పద్మశాలి బాంధవులు" అనే వాట్సాప్ గ్రూపులో శ్రీనివాస్ వివరణ ఇచ్చారు. శ్రీనివాస్ ఇచ్చిన వివరణకు మద్దతుగా హోల్ సేల్ చెప్పుల వ్యాపారి మానుపురి కృపాకర్(54) చప్పట్ల ఎమోజీతో రియాక్టయ్యారు. దీంతో కృపాకర్‌కు ఫోన్ చేసి రాములు దూషించారు. రాములు ప్రవర్తన పట్ల ఫిర్యాదు చేసేందుకు పద్మశాలి భవనానికి చేరుకోగా, కృపాకర్‌పై రాములు, అతని కుమారుడు, మరికొందరు వ్యక్తులతో కలిసి దాడి చేశారు. దాడిలో అంతర్గత అవయవాలకు తీవ్ర గాయాలవడంతో, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కృపాకర్ మరణించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Next Story