- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
లక్ష్మీ తండా లో వ్యక్తి దారుణ హత్య
వనపర్తి జిల్లా గోపాల్‌పేట మండల పరిధిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. లక్ష్మీ తండా గ్రామ పంచాయతీ పరిధిలో ఓ వ్యక్తిని గుర్తుతెలియని దుండగులు గొంతు కోసి హత్య చేశారు.

దిశ, గోపాల్‌పేట: వనపర్తి జిల్లా గోపాల్‌పేట మండల పరిధిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. లక్ష్మీ తండా గ్రామ పంచాయతీ పరిధిలో ఓ వ్యక్తిని గుర్తుతెలియని దుండగులు గొంతు కోసి హత్య చేశారు. స్థానికుల వివరాల ప్రకారం.. లక్ష్మీ తండాకు చెందిన మెగ్య నాయక్ (55) ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఆదివారం మధ్యాహ్నం పక్కింటి వారు ఏదో పని నిమిత్తం ఆయన ఇంటికి వెళ్లి పిలిచినా స్పందన రాకపోవడంతో లోపలికి వెళ్లి చూడగా మెగ్య నాయక్ విగతజీవిగా కనిపించారు. వెంటనే వారు బయటకు వచ్చి స్థానికులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించగా, మెగ్య నాయక్‌ను గొంతు కోసి హత్య చేసినట్లు గుర్తించారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. మృతుడికి ఇద్దరు కుమారులు ఉన్నారని, ఆయన భార్య గతంలోనే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. హత్యకు గల కారణాలు, నిందితుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. క్లూస్ టీమ్ సహాయంతో ఆధారాలను సేకరిస్తున్నారు.






