- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
HYD: పాతబస్తీలో దారుణం.. గంజాయి, స్టెరాయిడ్స్ గ్యాంగ్‌ల మధ్య ఘర్షణ
హైదరాబాద్(hyderabad)లోని పాతబస్తీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. చంద్రాయణగుట్టలో రెండు గ్రూపుల మధ్య సోమవారం సాయంత్రం భారీ ఘర్షణ జరిగింది.

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్(hyderabad)లోని పాతబస్తీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. చంద్రాయణగుట్టలో రెండు గ్రూపుల మధ్య సోమవారం సాయంత్రం భారీ ఘర్షణ జరిగింది. గంజాయి(Cannabis), స్టెరాయిడ్స్(Steroids) అమ్మకాల్లో తేడాలు వచ్చి.. విచక్షణారహితంగా దాడులకు పాల్పడ్డారు. ఈ దాడిలో అజీజ్ అనే వ్యక్తి మృతిచెందారు. అజీజ్ స్టెరాయిడ్స్ తీసుకుంటుండగా హత్య చేసిన ప్రత్యర్థులు అటాక్ చేసి హత్య చేశారు. స్థానిక సమాచారంతో విషయం తెలిసిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. దాడికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
కాగా, తెలంగాణలో డ్రగ్స్ నిర్మూలనకు ఈగల్ వ్యవస్థను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. రాష్ట్రంలోని డ్రగ్స్ ఎంటర్ అయ్యాయనే సమాచారం అందిన వెంటనే క్షణాల్లో ఈగల్ టీమ్ అక్కడకు చేరుకొని స్వాధీనం చేసుకుంటున్నారు. మరోవైపు ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా వారం రోజుల పాటు డ్రగ్స్ నివారణపై అవగాహన సదస్సులు జరిగాయి. హైదరాబాద్‌లో నిర్వహించిన సదస్సులో సీఎం రేవంత్ పాల్గొని మాట్లాడుతూ.. యువత గంజాయి, డ్రగ్స్‌కు బానిసలైతే దేశం మనుగడకే ప్రమాదమని చెప్పారు. డ్రగ్స్ నివారణలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలవాలని కోరుకున్నారు.






