దుగ్గిరాలలో దారుణం.. అప్పు ఇప్పించలేదని వ్యక్తి హత్య

by Naga Rani Yarlagadda |

ఉమ్మడి గుంటూరు జిల్లా దుగ్గిరాలలో దారుణ ఘటన చోటుచేసుకుంది.

దుగ్గిరాలలో దారుణం.. అప్పు ఇప్పించలేదని వ్యక్తి హత్య
X

దిశ, వెబ్‌డెస్క్: ఉమ్మడి గుంటూరు జిల్లా దుగ్గిరాలలో దారుణ ఘటన చోటుచేసుకుంది. దుగ్గిరాలలోని వంతెన డౌన్ లో రజకపాలెంకు చెందిన నీలాపు వీరబాబు (37)ను యాదవపాలెంలో ఇద్దరు వ్యక్తులు దారుణంగా హతమార్చారు. కత్తితో పొడిచి, గొంతుకోయడంతో వీరబాబు అక్కడికక్కడే మరణించినట్లు స్థానికులు తెలిపారు. చికెన్ వ్యాపారి నవీన్, వీరబాబు మధ్య డబ్బు విషయమై గొడవ జరిగింది. ఆ గొడవను మనసులో పెట్టుకున్న నవీన్.. తన బంధువైన కృష్ణతో కలిసి శుక్రవారం రాత్రి వీరబాబుతో మాట్లాడాలని వెళ్లాడు. అప్పు ఇప్పించలేదన్న కోపంతో తల్లి కళ్లెదుటే గొంతు కోయించి హత్య చేశాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తెనాలి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

Next Story