- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
VIDEO: బెంగుళూరులో షాకింగ్ ఘటన.. షటిల్ ఆడుతున్న బాలుడిని దారుణంగా తన్నిన వ్యక్తి
బెంగుళూరులో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. దక్షిణ బెంగుళూరులోని త్యాగరాజనగర్ లో తల్లితో కలిసి రోడ్డుపై షటిల్ ఆడుతున్న నీవ్ జైన్ అనే బాలుడిని వెనక నుండి వచ్చి ఓ వ్యక్తి కాలితో దారుణంగా తన్నాడు.

దిశ, వెబ్ డెస్క్: బెంగుళూరులో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. దక్షిణ బెంగుళూరులోని త్యాగరాజనగర్ లో తల్లితో కలిసి రోడ్డుపై షటిల్ ఆడుతున్న నీవ్ జైన్ అనే బాలుడిని వెనక నుండి వచ్చి ఓ వ్యక్తి కాలితో దారుణంగా తన్నాడు. తరవాత అక్కడ నుండి ఏమీ తెలియనట్టు వెళ్లిపోయాడు. ఘటన జరిగిన సమయంలో బాలుడి తల్లి దీపికా జైన్, బాలుడి సోదరి కూడా ఉన్నారు. అయితే దీపికా షటిల్ ఆడుతూ బిజీగా ఉన్న సమయంలో యువకుడు బాలుడిని తన్ని వెళ్లిపోయాడు.
బాలుడికి గాయాలు అవ్వడంతో తల్లిదండ్రులు సీసీ టీవీ ఫుటేజ్ పరిశీలించి షాక్ అయ్యారు. వీడియోలో యువకుడు బలంగా తన్నినట్టు కనిపిస్తోంది. వీడియో వైరల్ అవ్వడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు. దాడి చేసిన వ్యక్తి రంజన్ గా గుర్తించారు. అతడిని అరెస్ట్ చేసి జ్యుడిషియల్ కస్టడీకి తరలించారు. ప్రాథమిక విచారణలో అతడి మానసిక పరిస్థితి స్థిరంగా లేదని పోలీసులు తెలిపారు. బాలుడికి ముఖం, కాళ్లు, చేతులకు గాయాలు అవ్వడంతో ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. VIDEO






