ఎఫైర్ పెట్టుకుందని భార్య తల నరికి.. పోలీసులకు లొంగిపోయిన భర్త!

by Phanindra |

వివాహేతర సంబంధం పెట్టుకుందనే కారణంతో భార్య తల నరికేశాడో భర్త. తల తీసుకొని పోలీసు స్టేషన్‌లో లొంగిపోయాడు.

ఎఫైర్ పెట్టుకుందని భార్య తల నరికి.. పోలీసులకు లొంగిపోయిన భర్త!
X

దిశ, నేషనల్ బ్యూరో: వివాహేతర సంబంధం పెట్టుకుందని భార్య తల నరికాడో వ్యక్తి. ఈ ఘటన బెంగళూరు సమీపంలోని హెన్నగర ప్రాంతంలో వెలుగు చూసింది. 28 ఏళ్ల శంకర్ అనే వ్యక్తి తన భార్యతో కలిసి నివశిస్తున్నారు. ఈ జంట మధ్య చిన్న చిన్న మనస్పర్థలు ఉన్నట్లు సమాచారం. ఈ గొడవల వల్ల విడిపోదామని అనుకున్నప్పటికీ.. ఇద్దరూ కలిసే ఉండటంతో వాగ్వాదాలు మరింత పెద్దవయ్యాయని స్థానికులు తెలిపారు.


మంగళవారం రాత్రి పని నుంచి శంకర్ ఇంటికొచ్చేసరికి వేరే వ్యక్తితో అతని భార్య కనిపించింది. ఆగ్రహంతో ఊగిపోయిన శంకర్ ఇద్దరిపై దాడి చేశారు. ఈ క్రమంలోనే భార్య తల నరికి, ఆ తలను తీసుకొని సూర్యనగర పోలీస్ స్టేషన్‌కు నేరుగా వెళ్లి లొంగిపోయినట్లు తెలుస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Next Story